( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు నిరసనగా రోజు రోజుకూ ఉద్యమం ఊపందుకుంటోంది. శుక్రవారం విశాఖలోని కూర్మన్నపాలెం గేట్ వద్ద స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు నిరాహార దీక్ష చేపట్టారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి వివిధ కార్మిక సంఘాల నేతలు హాజరై దీక్షకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. తల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంత ఉందో.. విశాఖ ఉక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా అంతే ఉందన్నారు. వేలాది ఎకరాల భూములను దోచుకునేందుకే స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేస్తున్నారని ఆరోపించారు. ఏ పరిశ్రమకైనా భూములు కేటాయిస్తే వారు అమ్ముకోవడానికి వీల్లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కేవలం అసెంబ్లీలో తీర్మానం చేస్తే సరిపోదు…రాజకీయంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమలు ఎలా కాపాడుకోవాలో తెలుసు అని చెప్పారు చెప్పారు.
Must Read ;- అగ్రిమెంట్‌తో పోస్కో ఎంటర్.. 2019 నుంచే ‘విశాఖ ఉక్కు’పై స్కెచ్..