విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ ఏర్పాటైంది. పోరాట కమిటీలో అన్ని సంఘాలకు చోటు కల్పించారు. ప్రాణత్యాగాలు చేసి అయినా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకుంటామని కార్మిక సంఘాల నేతలు స్పష్టం చేశారు. అక్టోబర్ 2019న పోస్కో కంపెనీతో ఎంవోయూ చేసుకున్న తరవాత నెల రోజులకు కేంద్ర మంత్రి విశాఖ ఉక్కు పరిశ్రమకు వచ్చి ఎలాంటి జాయింట్ వెంచర్ ఉండదని హామీ ఇచ్చారని కార్మిక సంఘాల నాయకులు గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు భూములిచ్చిన రైతుల్లో ఇంకా 9 వేల మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని వారు గుర్తు చేశారు.
కాపాడుకుంటాం..
32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు కంపెనీని ప్రైవేటీకరణ చేయకుండా ప్రాణత్యాగాలు చేసి అయినా కాపాడుకుంటామని కార్మిక సంఘాల నాయకులు ప్రకటించారు. కరోనా వైరస్ కంటే భయకరమైన ప్రైవేటీకరణ వైరస్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని కార్మిక సంఘాల నేతలు విమర్శలు చేశారు. 20 వేల మంది ఉద్యోగులను, మరో 30 వేల మంది విశాఖ ఉక్కు పరిశ్రమై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల వారిని రోడ్డున పడేసే చర్యలు తీసుకుంటే చూస్తూ ఊరుకోమని వారు హెచ్చరించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు.
Must Read ;- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం: నారా లోకేష్











