విశాఖ ఉక్కు ఫ్యాక్టరిని ప్రైవేటీకరణను అన్ని వర్గాల వాళ్లు వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం ప్రకటన చేసిన రోజు నుంచి అన్ని పార్టీలవారు, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపడుతున్నాయి. కేంద్రం మాత్రం కనీసం నిరసనలపైన స్పందించకపోగా.. ప్రైవేటీకరణ ఆగదనే సూచనలు చేస్తుంది. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ టీడీపీ నాయకుడు పల్లా శ్రీనివాసరావు నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పల్లా శ్రీనివాసరావు చేపట్టిన నిరాహార దీక్ష 6 వరోజుకు చేరింది. స్వల్ప అనారోగ్యం తలెత్తడంతో.. ఆయనను పరీక్షించిన వైద్య బృందం షుగర్ లెవల్స్ తగ్గినట్లు చెప్పాయి. ఇలాగే కొనసాగితే ఆరోగ్యం మరింత క్షీణిస్తుందని వైద్యులు తెలిపారు. కిడ్నీలపై ప్రభావం చూపచ్చని వైద్యులు తెలిపారు. కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆయన దీక్షకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తుండగా.. సిపిఐ నారాయణ, శ్రీనివాసరావును పరామర్శించి.. సంఘీభావం తెలిపారు. కొనడానికి వచ్చిన వారిని అడ్డుకోవాలని నారాయణ పిలుపునిచ్చారు. పోరాటాలతో సాధించుకున్న కర్మాగారాన్ని అమ్మడానిక మీరెవరంటూ కేంద్రాన్ని నారాయణ ప్రశ్నిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం ఎంపీలు మోడీ ఇంటి ముందు ధర్నా చేపట్టాలని చలసాని శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
Must Read ;- పల్లా శ్రీనివాసరావు దీక్షకు సంఘీభావం తెలిపిన నారా లోకేష్..











