టీడీపీ నాయకులు ఆదీ నుంచి విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ పోరాటం సాగిస్తున్నారు. అందులో భాగంగా.. ప్రజలను హక్కులను కాపాడడానికి దీక్షకు పూనుకున్నారు పల్లా శ్రీనివాసరావు. అన్ని వర్గాల వారు తమ మద్దతు తెలియజేస్తూ.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా, టీడీపీ నాయకుడు నారా లోకేష్, పల్లా శ్రీనివాసరావు దీక్ష స్థలికి చేరుకుని సంఘీభావం తెలిపారు. పూలమాల వేసి మరీ పల్లా నిర్ణయాన్ని సమర్థించారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దీక్షలో తాను కూడా కూర్చుని.. విశాఖ ఉక్కు కర్మాగారం.. ఆంధ్రుల హక్కని.. ఇలా దాన్ని ప్రైవేటు పరం చేయడం దారుణమని తెలియజేశారు. నారా లోకేష్‌తో పాటు.. శ్రీ భరత్ కూడా దీక్ష స్థలికి చేరుకుని సంఘీభావం తెలుపుతూ.. విశాఖ ఉక్కు ప్రైవటీకరణను వ్యతిరేకిస్తూ ప్రసంగించారు.
Must Read ;- ఒడిశా పెత్తనం.. పథకం ప్రకారం విశాఖ ఉక్కు నిర్వీర్యం











