సీఎం జగన్ వినతి మేరకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధిత్యనాద్ దాస్ పదవీ కాలం మూడు నెలలు పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. గత డిసెంబర్ 31న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నీలం సాహ్ని పదవీ విరమణ చేయగా ఆ స్థానంలో అప్పుడు ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న 1987 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఆధిత్యనాద్ దాస్‌ను సీఎం జగన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ నెలాఖరుతో దాస్ పదవీ కాలం ముగియనుండటంతో ఆయన పదవీ కాలం మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి జగన్ మే 17న ప్రధానికి లేఖ రాశారు. ఈ మేరకు దాస్ పదవీ కాలం మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్రధాని ఆమోదించారు. దీంతో కేంద్రంలోని సిబ్బంది వ్యవహారాల శాఖ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఆధిత్యనాద్ దాస్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సెప్టెంబర్ 30వ తేదీ వరకు పదవిలో కొనసాగనున్నారు. ఇప్పటికే కేంద్ర సర్వీసుల్లో ఉన్న ఏపీ కేడర్‌కు చెందిన శమీర్ శర్మను తిరిగి ఏపీకి కేటాయించారు. నూతన సీఎస్‌గా ఆయనకు అవకాశం దక్కుతుందనే ప్రచారం జరిగినా ప్రస్తుతానికి దాస్ పదవీ కాలం పొడిగించారు.
అరెస్ట్ వద్దని ఆదేశాలు ఇవ్వలేం.. మిధున్ రెడ్డికి హైకోర్ట్ షాక్..!!
వైసీపీ ఎంపీ, మాజీ మంత్రి పెద్దిరెడ్డి తనయుడు మిథున్ రెడ్డికి బిగ్‌షాక్ తగిలింది....