సినిమా థియేటర్ల ప్రారంభం మీద స్పష్టత వచ్చింది. విడుదల కోసం వరుసగా సినిమాలు క్యూకడుతాయనుకుంటే ఒక్కటీ కనిపించడం లేదు. సాయిధరమ్ తేజ్ సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’ను మాత్రం థియేటర్లలోనే విడుదల చేయాలనుకుంటున్నారు. దీని విడుదల తేదీ మాత్రం ఇంతవరకు వెలువడ లేదు. కింగ్ నాగార్జునకు డిసెంబరు సెంటిమెంటు ఎక్కువ. ఆయన హీరోగా నటించిన ‘వైల్డ్ డాగ్’ షూటింగ్ కార్యక్రామాలను పూర్తిచేసుకుంది.
మరి ఈ సినిమాని థియేటర్లలోనే విడుదల చేయవచ్చనుకుంటే అందుకు విరుద్ధమైన మాట వినిపిస్తోంది. దీన్ని ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నట్టు తెలిసింది. నాగార్జునకు ‘మన్మథుడు 2’ తర్వాత గ్యాప్ వచ్చింది. అహిషోర్ సోల్మన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘వైల్డ్ డాగ్’లో ఆయన నటించారు. ఇటీవలే దీని షూటింగ్ కార్యక్రమాలు జరిగాయి. పోస్ట్ ప్రొడక్షన్ పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇందులో దియా మిర్జా, సయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్ కౌంటర్ స్పెషలిస్టు పాత్రలో నాగార్జున నటించారు.
నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి వారు సుముఖంగా లేరని తెలుస్తోంది. సంక్రాంతి మీద చాలా మంది దృష్టి ఉంది. అందువల్ల సంక్రాంతి బరిలోకి దిగడం సేఫ్ కాదన్న ఆలోచన కూడా ఉంది. దాంతో ఓటీటీ అయితేనే బెస్ట్ ఆప్షన్ అనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ ను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఓటీటీ కన్ ఫర్మ్ అయినా థియేటర్లలోనూ అదే సమయంలో విడుదల చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది.
Must Read ;- ‘వైల్డ్ డాగ్’ మూవీ టీమ్ కు గుడ్ బై చెప్పేశాడు !