కరోనా కట్టడిలో ఢిలీ ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. లాక్ డౌన్ పక్కాగా అమలు చేస్తూ, పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య తగ్గించే ప్రయత్నం చేస్తోంది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో మద్యం హోం డెలివరీ చేయాలని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయించింది. ఇంటి వద్దకే పంపిణీ చేసేలా మద్యం వ్యాపారులకు పర్మిషన్ ఇచ్చింది. మొబైల్ యాప్ లేదా వెబ్ సైట్ లో క్లిక్ చేస్తే మద్యం డోర్ డెలివరీ అవుతుంది. ఈ నిర్ణయంతో మందుబాబులంతా తెగ ఆనంద పడుతున్నారు. ఢిల్లీతో పాటు మరికొన్ని రాష్ట్రాలు నిర్ణయం తీసుకోనున్నాయి.
Must Read ;- ఢిల్లీలో తగ్గిన కేసులు: ఆంక్షలు ఎత్తేస్తామంటున్న కేజ్రీ