శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నటించనుండటం తనకెంతో ఆనందంగా ఉందని హీరో ధనుష్ అన్నారు. వీరిద్దరి కలయికలో ఓ పాన్ ఇండియా మూవీ రూపొందనున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వార్తలు వచ్చాయి. తాజాగా ధనుష్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ ప్రకటన చేశారు. శేఖర్ కమ్ములతో వర్కింగ్ ఎక్సయిటింగ్ గా ఉందంటూ ట్వీట్ చేశారు. శేఖర్ కమ్ముల తాను ఇష్టపడే దర్శకుల్లో ఒకరని ధనుష్ అన్నారు. ఆయనతో పనిచేయడానికి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నానని అన్నారు.
నిర్మాతలు నారాయణదాస్ నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మాణంలో ఎస్వీసీ ఎల్ఎల్పీ సంస్థలో నటిచడం సంతోషంగా ఉందన్నారు ధనుష్. సినిమా ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నా అని ట్వీట్ లో పేర్కొన్నారు. దర్శకుడు శేఖర్ కమ్ముల, ధనుష్ తెలుగు తమిళ హిందీ త్రిభాషా చిత్రాన్ని శుక్రవారం అనౌన్స్ చేశారు. ఈ సినిమా ధనుష్ కు తొలి స్ట్రైట్ తెలుగు సినిమా కానుంది.త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది.
Must Read ;- ధనుష్ తో శేఖర్ కమ్ముల పాన్ ఇండియా మూవీ.