కోలీవుడ్ స్టార్ ధనుష్.. టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఎవరి డైరెక్షన్లో ధనుష్ టాలీవుడ్ ఎంట్రీ ఉంటుంది అనుకున్నారు. ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ పాన్ ఇండియా మూవీ చేస్తుండడం విశేషం. ఈ పాన్ ఇండియా మూవీని నాగచైతన్య తో లవ్ స్టోరీ చిత్రాన్ని నిర్మిస్తున్న సునీల్ నారంగ్ నిర్మిస్తున్నారు. ధనుష్ విభిన్న కథలను ఎంచుకుంటాడు. ఇటీవల ధనుష్ నటించిన అసురన్, కర్ణన్ చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఈ చిత్రాల్లో ధనుష్ నటన ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే.
ఇక సెన్సిబుల్ చిత్రాలతో సూపర్ కూల్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు శేఖర్ కమ్ముల. అలాంటిది వీరిద్దరి కాంబోలో పాన్ ఇండియా మూవీ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ధనుష్, శేఖర్ కమ్ముల కాంబినేషన్ ని ఎవరూ కలలో కూడా ఊహించి ఉండరు. అలాంటిది ఈ కాంబినేషన్ సెట్ అయ్యింది. ఈ మూవీని అఫిషియల్ గా అనౌన్స్ చేశారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి బ్యానర్ లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రూపొందే ఈ సినిమాతో శేఖర్ కమ్ముల బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.
Must Read ;- టాలీవుడ్ లో స్ట్రైట్ మూవీ చేయబోతున్న కోలీవుడ్ స్టార్ హీరో?