అల్లరి నరేశ్ దాదాపు ఎనిమిదేళ్ళ తర్వాత ‘నాంది’మూవీ తో సూపర్ సక్సెస్ దక్కించుకున్నాడు. కామెడీ హీరోగా ఒక్క హిట్టు కూడా లేక.. ఇప్పటివరకూ స్ట్రగుల్ అనుభవించిన ఈ హీరో .. ఇప్పుడు ఈ సినిమాతో సరికొత్తగా ఎలివేట్ అయ్యాడు. దీంతో .. మిగతా దర్శకులకు తన కోసం ఇలాంటి కథలే రాయమని ఇండైరెక్ట్ గా హింట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం పలువురు దర్శకులు అల్లరోడి కోసం ఆసక్తికరమైన కథాకథనాలు రాయడంలో బిజీ అయ్యారు.
ఇక అసలు విషయానికొస్తే.. ‘నాంది’ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇతర భాషలకు తీసుకెళ్ళడానికి ఓ మాస్టర్ స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నానీ నటించిన జెర్సీ సినిమాను హిందీలో నిర్మిస్తోన్న ఆయన .. నాంది సినిమాకి సంబంధించిన అన్ని భాషల రీమేక్ రైట్స్ కొనేశారని సమాచారం. దీనికోసం ఆయన పెద్ద ఎత్తునే ఖర్చుచేశారట. ఈ సినిమాను తమిళ, మలయాళ, కన్నడ భాషలతో పాటు.. హిందీలోకి కూడా తీసుకెళ్ళ ప్రయత్నాల్లో దిల్ రాజు ఉన్నారని టాక్.
దాదాపు రూ. 2.7 కోట్లలకు ‘నాంది’ సినిమా రీమేక్ రైట్స్ అమ్ముడు పోయాయని టాక్స్ వినిపిస్తున్నాయి. అలాగే.. ఈ సినిమా ఓటీటీ రైట్స్, శాటిలైట్ రైట్స్ కూడా భారీ ఎత్తున అమ్ముడు పోయాయని తెలుస్తోంది. మొత్తానికి గతంలో నిర్మాతలకు మినిమమ్ గ్యారెంటీ హీరో అనిపించుకొని .. ఆ తర్వాత క్రమేపి .. ఆ పేరు పొగొట్టుకొన్న నరేశ్ .. ఇప్పుడు నాంది సినిమాతో మంచి కమర్షియల్ హిట్ కొట్టి.. మళ్ళీ ఫామ్ లోకి వచ్చేశాడు. మరి ముందు ముందు .. నరేశ్ మళ్ళీ ఆ పేరు దక్కించుకుంటాడేమో చూడాలి.