‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు దర్శకుడు బుచ్చిబాబు సానా. తొలి చిత్రంతోనే రూ.100కోట్ల క్లబ్ లోకి చేరిన ఆయనతో సినిమాలు తీయడానికి టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్ అందరూ పోటీ పడుతున్నారు. అయితే ముందుగా ఇచ్చిన కమిట్ మెంట్ ప్రకారం బుచ్చిబాబుకి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో మరికొన్ని సినిమాలు తీయాల్సి ఉందట. అందుకే బుచ్చిబాబు దర్శకత్వంలోని రెండో సినిమాను కూడా మైత్రీ వారే నిర్మించబోతున్నారు.
బుచ్చిబాబు తన రెండో ప్రయత్నంగా యన్టీఆర్ తో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేయబోతున్నాడని టాక్స్ వినిపిస్తున్నాయి. దీనికోసం బుచ్చిబాబుకి మైత్రీ వారు ఏకంగా.. రూ. 10కోట్లు పారితోషికం ఆఫర్ చేశారట. బుచ్చిబాబు నెరేట్ చేసిన స్టోరీ యన్టీఆర్ కు బాగా నచ్చిందట. అయితే ఆయన నుంచి ఇంకా కన్ఫర్మేషన్ రాలేదని టాక్. ఒక వేళ అది వర్కవుట్ కాకపోతే… మరో యంగ్ హీరోతో బుచ్చిబాబు సినిమా తీస్తాడట. ఇక ఈ ప్రాజెక్ట్ గురించి పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయట. మరి బుచ్చిబాబు రెండో సినిమా యన్టీఆర్ తోనే ఉంటుందేమో చూడాలి.
Must Read ;- బుచ్చిబాబుకు ‘సానా’ తెలివితేటలున్నాయే!











