Pan India Star Prabhas Adipurush Movie Update :
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న బాలీవుడ్ మూవీ ఆదిపురుష్. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ తో సినిమా చేయాలని బాలీవుడ్ డైరెక్టర్స్ చాలా మంది ప్రయత్నించారు. ఆఖరికి ఓంరౌత్ కి ప్రభాస్ ఓకే చెప్పారు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుంటే.. బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ ఆలీఖాన్ రావణుడుగా నటిస్తున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీతగా నటిస్తుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రకటించినప్పటి నుంచి ప్రభాస్ ను శ్రీరాముడి గెటప్ లో చూద్దామని అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
అయితే.. ఆదిపురుష్ టీమ్ ప్రభాస్ శ్రీరాముడు గెటప్ ని ఇప్పటి వరకు రివీల్ చేయలేదు. శ్రీరామనవమికి రిలీజ్ చేస్తారనుకున్నారు కానీ.. రిలీజ్ చేయలేదు. ఇదిలా ఉంటే.. ఈ రోజు ఆదిపురుష్ రిలీజ్ డేట్ ను అఫిషియల్ గా ప్రకటించారు. ఇంతకీ ఎప్పుడు ఆదిపురుష్ విడుదల అంటే… 2022లో ఆగష్టు 11న. భారీ బడ్జెట్ తో.. భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రాన్ని హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.
ప్రభాస్ బాలీవుడ్ లో నటిస్తున్న మూవీ ఇది. దీంతో ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఓ వైపు సలార్ సినిమా షూటింగ్ చేస్తూనే మరో వైపు ఆదిపురుష్ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఆదిపురుష్ చిత్రం చరిత్ర సృష్టించడం ఖాయం అని టీమ్ గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి.. బాహుబలి సినిమాతో చరిత్ర సృష్టించిన ప్రభాస్ ఆదిపురుష్ సినిమాతో కూడా చరిత్ర సృష్టిస్తారేమో చూడాలి.
Must Read ;- ప్రభాస్, పవన్ కళ్యాణ్ సినిమాల గురించి క్లారిటీ ఇచ్చిన సమంత











