పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శక దిగ్గజం ఓం రౌత్ కాంబినేషన్‌లో రూపొందుతున్నభారీ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. రామాయణం స్పూర్తితో రూపొందుతోన్న ఈ భారీ చిత్రంలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండడం విశేషం. బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సీతగా నటిస్తోంది. ఈ సినిమాని అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రభాస్ ని శ్రీరాముడిగా ఎప్పుడెప్పుడు చూస్తామా..? అని అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు శ్రీరాముడుగా ప్రభాస్ లుక్ ని రిలీజ్ చేయలేదు. దీంతో ఈ మూవీ పై మరింతగా క్యూరియాసిటీ పెరిగింది. దాదాపు 500 కోట్లతో ఈ భారీ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ భారీ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
ఈ క్రేజీ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. ఈ చిత్రం షూటింగ్ మొదలుపెట్టి ఇప్పటికి 100 రోజులు పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్రబృదం తెలియచేసింది. ప్రభాస్ బాలీవుడ్‌లో నటిస్తున్న స్ట్రైట్ మూవీ ఇదే కావడం విశేషం. ఇందులో ఆయన రాముడిగా నటిస్తుంటే.. సన్నీ సింగ్, దేవదత్తా నాగే, సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. దాదాపు 500 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న
ఈ చిత్రానికి ప్రభాస్ అందుకుంటున్న రెమ్యునరేషన్ కూడా భారీ స్థాయిలో ఉందని టాక్ వినిపిస్తోంది.బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా, సన్నీసింగ్ లక్ష్మణుడిగా కనిపించబోతున్నారు. అయితే.. ఇప్పటికి ఈ మూవీ చిత్రీరణ ప్రారంభించి 100 రోజులు అవ్వడంతో చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. మరికొన్ని వారాలలో మొత్తం షూటింగ్ కంప్లీట్ కాబోతోందని సమాచారం. ఇప్పటికే కృతి సనన్, సైఫ్ అలీఖాన్ తమ పార్ట్ షూటింగ్ ను కంప్లీట్ చేశారు, ప్రస్తుతం ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ మూవీని 2022 ఆగస్ట్ 8న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
Must Read ;- రాధేశ్యామ్ టీజర్ వ్యూస్ ఆగిపోవడానికి కారణం ఇదే











