మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న చిరంజీవి.. రీసెంట్ గా గాడ్ ఫాదర్ మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లారు. మెహర్ రమేష్ తో భోళా శంకర్ మూవీని అనౌన్స్ చేశారు. అలాగే బాబీ డైరెక్షన్ లో మూవీని కూడా ప్రకటించారు. అలాగే యవ దర్శకుడు మారుతితో కూడా చిరంజీవి సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పుడు తాజాగా పాన్ ఇండియా రైటర్ విజయేంద్రప్రసాద్ చిరంజీవి కోసం ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.
బాహుబలి, భజరంగీ భాయ్ జాన్… ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ చిత్రాల రచయిత విజయేంద్ర ప్రసాద్ కి చిరంజీవి అంటే.. విపరీతమైన అభిమానం. ఆయన ఎప్పటి నుంచో చిరుతో కలసి పని చేయాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని గతంలో చాలా సార్లు చెప్పారు. అయితే.. ఇన్నాళ్లకు చిరుతో విజయేంద్రప్రసాద్ మూవీ ఫిక్స్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. ఇటీవల విజయేంద్ర ప్రసాద్ చిరంజీవికి సరిపడ కథ.. రాశారని, అందుకోసమే ఇద్దరి మధ్య ఇటీవల చర్చ జరిగిందని సమాచారం. టాలీవుడ్ లో ఒకటి, రెండు, మూడు స్థానాలు చిరంజీవివే. అన్ని రికార్డులూ ఆయన పేరు మీద ఉండాలి.
త్వరలో ఆయన సినిమా పాత రికార్డులన్నీ చెరిపేసే స్థాయిలో ఆడాలి. అందుకోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తాను అన్నారు విజయేంద్రప్రసాద్. ఈ కామెంట్లు చిరుతో తను చేయనున్న సినిమాను దృష్టిలో పెట్టుకునే చేశారంటున్నారు. అయితే.. చిరు కోసం విజయేంద్రప్రసాద్ అందించే కథను ఎవరు డైరెక్టర్ చేయనున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
Must Read ;- బాబీ చెప్పిన వీరయ్య టైటిల్ చిరంజీవికి నచ్చలేదా?











