పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పాన్ ఇండియా హీరో రానా దగ్గుపాటిల క్రేజీ కాంబినేషన్లో రూపొందుతోన్న భారీ మల్టీస్టారర్ భీమ్లా నాయక్. ఈ చిత్రానికి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ భారీ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సంభాషణలు – స్ర్కీన్ ప్లే అందిస్తుండడం విశేషం. ఇక సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం నుండి విడుదల అయిన ప్రచార చిత్రాలు, వీడియో లు, పాటలు సినిమా పై భారీ అంచనాలను పెంచేశాయి.
తాజాగా ఈ చిత్రం నుండి లాలా భీమ్లా లిరికల్ వీడియో సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాటను త్రివిక్రమ్ శ్రీనివాస్ రాయడం విశేషం. ఈ పాట సౌత్ ఇండియాలో రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఏంటా రికార్డ్ అంటే.. 24 గంటల్లో యూట్యూబ్ లో 10.20 మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకొని ఆల్ టైమ్ టాప్ లో దూసుకెళుతుంది. అదే విధంగా 658 కే కి పైగా లైక్స్ తో అత్యధికంగా లైక్స్ వచ్చిన పాటల్లో ఆల్ టైమ్ సెకండ్ ప్లేస్ లో నిలిచింది. మొత్తానికి ఈ పాటకి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తుంది.
ఈ భారీ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. సంక్రాంతికి భీమ్లా నాయక్ రావడం అనుమానమే అని వార్తలు వస్తున్నప్పటికీ.. సంక్రాంతికి భీమ్లా నాయక్ రావడం పక్కా అంటూ నిర్మాణ సంస్థ ప్రకటిస్తుంది. దీంతో ఈ సంక్రాంతికి పోటీ ఓ రేంజ్ లో ఉండబోతుంది అనిపిస్తుంది. మరి.. పాటలతోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న భీమ్లా నాయక్ ఇక బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు సెట్ చేస్తాడో..? చూడాలి.
Must Read ;- పవర్ స్టార్ అభిమానులకు ఫీస్ట్ లా ‘లాలా భీమ్లా’











