తొలిసారి ఇండియాకు వచ్చిన విదేశీయులకు మంచి అభిప్రాయాన్ని కలిగించేలా ధిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పరిస్థితులు లేవని స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి పేర్కొన్నారు. ఈ విషయాలను పరిశీలించాలంటూ సోషల్ మీడియాలో ఆయన పెట్టిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఆ విమానాశ్రయంలో ఆయనకు ఎదురైన అనుభవాలను ఆయన అందులో ప్రస్తావిస్తూ దయచేసి వాటిని పరిశీలించాలంటూ ప్రభుత్వాలకు సూచించారు. ఆయన స్వీయానుభవం ఏంటంటే..
దరఖాస్తులు పూరించేందుకు అవస్థలు
‘అర్థరాత్రి ఒంటి గంటకు లుఫ్తాన్తా విమానంలో దిగాను. ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ చేయించుకోవడానికి దరఖాస్తులను ఇచ్చారు. అందరు ప్యాసింజర్లూ దరఖాస్తులను గోడకు ఆనించి, మరికొందరు కింద కూర్చుని వాటిని పూర్తి చేస్తున్నారు. ఇదేమీ నాకు బాగా అనిపించలేదు. దరఖాస్తులను పూరించేందుకు టేబుల్స్ ఏర్పాటు చేస్తే బాగుండేది. ఇక్కడ నాకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది ఏమిటంటే, బయటకు రాగానే ఎన్నో వీధి కుక్కలు కనిపించాయి. ఇది తొలిసారిగా భారత్‌కు వచ్చే విదేశీయులకు మన దేశంపై మంచి అభిప్రాయాన్ని కలిగించబోదు. ఈ విషయాన్ని అధికారులు దయచేసి పరిశీలించాలి. కృతజ్ఞతలు…’ అని రాజమౌళి ట్వీట్ చేశారు.
పరిస్థితి మారుతుందంటూ..
రాజమౌళి ట్వీట్ చూసిన వారు కుక్కలకు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించాలని, మీ నుంచి ట్వీట్ వచ్చింది కాబట్టి పరిస్థితి మారుతుందని, తాము కూడా ఇదే విధమైన పరిస్థితిని ఎదుర్కొన్నామని చాలామంది పేర్కొన్నారు. ఈ విషయాన్ని విమానాశ్రయ అధికారులు, సీఆర్పీఎఫ్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారా?అని కూడా కొందరు ప్రశ్నించారు. ఏదేమైనా మన దేశం పరువు పోకుండా ఆయన చేసిన సూచనలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Must Read ;- ఆర్ఆర్ఆర్ వచ్చేది దసరాకే.. ఇదిగో సాక్ష్యం
And surprised to find so many stray dogs in the hangar outside the exit gate. Again not a great first impression of India for the foreigners. Please look into it. Thank you…
— rajamouli ss (@ssrajamouli) July 2, 2021











