పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’. వేణుశ్రీరామ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. సమ్మర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ మలయాళంలో విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో పవర్ స్టార్ తో పాటు దగ్గుబాటి రానా కూడా నటిస్తున్నారు.
ఇటీవలే ఈ సినిమాని పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాకి యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్ర్కీన్ ప్లే – సంభాషణలు అందిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి వర్క్ చేస్తున్న విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్ సంస్థ అఫిషియల్ గా ఎనౌన్స్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ క్రేజీ మూవీకి త్రివిక్రమ్ ఘోస్ట్ డైరెక్టర్ అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది.
స్ర్కీన్ ప్లే – సంభాషణలు మాత్రమే కాకుండా..ఈ సినిమాకి సంబంధించిన ప్రతి డిపార్టెమెంట్ లో త్రివిక్రమ్ ఇన్ వాల్వ్ అవుతున్నారని.. మ్యూజిక్ సిట్టింగ్స్ లో కూడా త్రివిక్రమ్ పాల్గొంటున్నారని తెలిసింది. గతంలో ‘తీన్ మార్’ మూవీకి త్రివిక్రమ్ సంభాషణలు అందించారు. సంభాషణలు బాగున్నాయి అని పేరు వచ్చింది. అయితే.. ఆ మూవీ ప్లాప్ అయ్యింది. ఆ క్రెడిట్ డైరెక్టర్ జయంత్ ఖాతాలో పడింది. అందుచేత ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ సక్సస్ అయితే.. క్రెడిట్ త్రివిక్రమ్ కే దక్కుతుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే.. డైరెక్టర్ సాగర్ చంద్ర ఖాతాలో పడుతుంది అంటున్నారు. మరి.. ఈ క్రేజీ మూవీకి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.