దర్శక ధీరుడు రాజమౌళి క్రేజీ మల్టీస్టారర్ ‘ఆర్.ఆర్.ఆర్’ గురించి ప్రస్తుతం దేశం అంతా ఎదురు చూస్తున్నారు.. అక్టోబర్ 13న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల అవు తుండడంతో.. రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. అలాగే.. ఈ సినిమా గురించి మేకర్స్ ఇచ్చే సూపర్ అప్టేడ్స్ పై అభిమానులు మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకూ తారక్, చరణ్ పుట్టిన రోజు సందర్భంగా .. విడుదలైన వీడియోలు, స్పెషల్ లుక్స్ విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల ఆలియా భట్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన సీత లుక్ జనాన్ని ఆకట్టుకోగా.. నేడు అజయ్ దేవ్ గణ్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన లుక్ ను విడుదల చేశారు మేకర్స్. అజయ్ దేవ్ గణ్ గెటప్, మోషన్ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అజయ్ దేవ్ గణ్ గెటప్ చూస్తుంటే.. ఒక విప్లవ నాయకుడిగా కనిపిస్తున్నారు. తలపాగా , నుదుటన పొడవైన కుంకుమ బొట్టు, గాయమోడుతున్న తల, తూటాలు తగిలించిన పొడవైన చొక్కా.. విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్ర సమర శంఖం పూరించిన విప్లవ సేనాని గా చాలా పవర్ ఫుల్ గా కనిపిస్తున్నారు అజయ్ దేవ్ గణ్. ఈ సినిమాలో ఆయన పాత్ర గూస్ బంప్స్ తెప్పిస్తుందని అంటున్నారు. హీరోలుగా నటిస్తోన్న తారక్, చెర్రీలకు గురువులాంటి పాత్రను ఆయన పోషిస్తున్నరని తెలుస్తోంది. ఆయన స్ఫూర్తితోనే వారిద్దరూ .. ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసి.. బ్రిటీష్ వారి మీద పోరాటం చేస్తారట. మరి అజయ్ దేవ్ గణ్ ఆర్.ఆర్.ఆర్ లో ఎంత పవర్ పుల్ పెర్ఫార్మెన్స్ ఇస్తారో చూడాలి.
Also Read;రాజమౌళి ఆర్ఆర్ఆర్ క్లైమాక్స్ కు హాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్
LOAD… AIM… SHOOT…
He derives strength from empowering his people!
Presenting @AjayDevgn from #RRRMovie. https://t.co/XMfExPqZah@tarak9999 @AlwaysRamCharan @aliaa08 @OliviaMorris891 @DVVMovies @RRRMovie #AjayDevgn #HappyBirthdayAjayDevgn#RRR
— rajamouli ss (@ssrajamouli) April 2, 2021