ఏపీలో భవన నిర్మాణ కార్మికులకు కూలీ పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వం వెంటనే స్పందించి 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.టీడీపీ అధికారంలో ఉండగా ఏటా భగీరథ జయంతిని అధికారికంగా జరుపుకున్నామని,ఈ ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులను గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు. ఇసుక ధరలు విపరీతంగా పెంచడం వల్ల కూలీ పనులు లేక 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇసుక ధరలు రెట్టింపు
ఏపీలో ఇసుక ధరలు,రవాణా ఖర్చుల పేరుతో టన్నుకు వెయ్యి రూపాయలు దోచుకుంటున్నారని చంద్రబాబునాయుడు విమర్శించారు.టీడీపీ అధికారంలో ఉండగా ఉచితంగా ఇసుక ఇవ్వడం వల్ల భవన నిర్మాణ కార్మికులకు కూలీ పనులు దొరికాయన్నారు.ఇసుక అధిక ధరలకు విక్రయించడం,ఇసుక కొరత,కరోనా కారణంగా రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులను ప్రభుత్వం ఉదారంగా ఆదుకోవాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
Must Read ;- వాళ్లని వెంటనే విడుదల చేయాలి.. డీజీపీకి చంద్రబాబు లేఖ











