Drunk And Drive In Hyderabad Police :
కఠిన చట్టాలు అమలుచేస్తున్నా… పోలీసులు భారీ జరిమానాలు విధిస్తున్నా.. మందుబాబుల తీరు ఏమాత్రం మారడం లేదు. మోతాదుకు మంచి మద్యం తాగుతూ రోడ్లపై రయ్ రయ్ అంటూ దూసుకుపోతున్నారు. పోలీసుల నుంచి తప్పించునేందుకు అడ్డదారుల్లో ఇళ్లకు చేరుకుంటున్నారు. డ్రైంకన్ డ్రైవ్ రూల్స్ ను ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఫలితంగా ఇతరుల ప్రమాదాలకు కారణమవుతున్నారు. యువకులు, పెద్దలే కాకుండా మైనర్లు కూడా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. కరోనా కారణంగా పోలీసులు ఇన్నాళ్లు డ్రైంకన్ డ్రైవ్ చేపట్టలేదు. కేసులు తగ్గుతుండటంతో మళ్లీ సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్ పరిధిలో పోలీసులు ముమ్మరంగా స్పెషల్ డ్రైవ్ లు చేస్తున్నారు.
353 మందికి జైల్ శిక్ష
సైబరాబాద్ పోలీసులు పలు ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తూ మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. డ్రంకన్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. తాజాగా డ్రంకన్ డ్రైవ్లో పట్టుబడ్డ 353 మందికి జైల్ శిక్ష పడింది. పోలీసులు కోర్టుల్లో అభియోగాలను నమోదు చేశారు. విచారణ జరిపిన కోర్టు ఇటీవల 353 మందికి ఒక రోజు నుంచి 20 రోజుల వరకు జైలు శిక్షను ఖరారు చేస్తున్నట్లు వెల్లడించింది. జైలు శిక్షతో పాటు మందుబాబుల డ్రైవింగ్ లైెసెన్స్ కూడా సస్పెండ్ చేయాలంటూ ఆర్టీఓ అధికారులకు పోలీసులు లేఖ కూడా రాశారు.
కేసుల వివరాలివే..
- కూకట్పల్లిలో – 79
- మియాపూర్ – 60
- మాదాపూర్ – 41
- బాలానగర్ – 49
- రాజేంద్రనగర్ -30
- శంషాబాద్ – 24
- గచ్చిబౌలిలో – 50
- Must Read ;- విచిత్రం అంటే ఇదే.. ఇటు జైలు, అటు బెయిలు











