Rats Empty 12 Sealed Wine Bottles In Tamil Nadu Liquor Store :
మీ ఇంట్లో ఎలుకలు ఉన్నాయా.. అయితే వెంటనే జాగ్రత్త పడండి మరి. ఎలుకలే కదా.. ఏ బియ్యం సంచుల మధ్యనో, ఏ బెడ్ కిందనో దూరుతాయిలే అని లైట్ గా తీసుకోకండి. బట్టలు, పుస్తకాలను చిందర వందర చేస్తాయి తప్ప… అంతకమించి ఇంకేం చేస్తాయిలే.. అని పొరపాటునా కూడా అనుకోకండి. ఎలుకల గురించి ఇదంతా ఎందుకంటారా.. చల్లని బీరు.. కిక్ ఇచ్చే వైన్స్ కు సైతం ఎలుకలు రుచి మరుగుతున్నాయట. ఎలుకలు ఏంటి? మందు తాగడమేంటి? అనే సందేహాలు ఇంకా వస్తే.. ఈ సంఘటన గురించి తెలుసుకోవాల్సిందే..
వామ్మో ఇవేం ఎలుకలు..
తమిళనాడు నీలగిరి జిల్లా గుడలూర్ లోని కదంపూజాలో ప్రభుత్వం నడుపుతున్న వైన్స్ షాపు ఉంది. అయితే లాక్ డౌన్, కరోనా కారణంగా మద్యం షాపును మూసివేశారు. కరోనా కేసులు తగ్గడంతో సదరు నిర్వాహకులు వైన్ షాపును ఓపెన్ చేశారు. షాపు లోపలికి వెళ్లి చూడగానే మద్యం బాటిళ్లు ఖాళీగా కనిపించడం షాక్ కు గురి చేసింది. 12 మద్యం బాటిళ్ల మూతలను ఎలుకలు కొరికినట్టుగా తేలింది. ఎక్సైజ్ శాఖ అధికారులు క్షుణంగా పరిశీలించి.. ఎలుకలే మందు బాటిళ్లను ఖాళీ చేశాయని స్టేట్ మెంట్ కూడా ఇచ్చారు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మందుబాబులు ఒకింత ఆశ్యర్యం వ్యక్తం చేశారు. ఎలుకల్లో కూడా మందుబాబులు ఉన్నాయని, కిక్ బాగా ఎక్కినట్టే ఉందే.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
గతంలో బీహార్ లో కూడా..
గతంలో ఈ తరహా ఘటన బీహార్ లో చోటు చేసుకుంది. అప్పుడు కూడా మద్యాన్ని ఎలుకలు తాగేశాయని అధికారులకు తెలిపారు. అంతే కాదు.. డ్రగ్స్ ప్యాకెట్లనూ ఎలుకలు తినేశాయని పోలీసులు కోర్టుకు విన్నవించారు. ఎలుకలకు ఇదేం చెడు అలవాటబ్బా అని చాలామంది ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. తాజా ఘటనతో ఇంట్లో మద్యం బాటిళ్లను జాగ్రత్తగా దాచేయాల్సిందే..
Must Read ;- ఇదీ సిట్ ఛార్జి ‘షిట్’.. సినీ ప్రముఖులకు క్లీన్ చిట్











