Hero Satyadev Emotional Words About Nani :
సత్యదేవ్ కథానాయకుడిగా ‘తిమ్మరుసు’ సినిమా రూపొందింది. మహేశ్ కోనేరు నిర్మించిన ఈ సినిమాకు శరణ్ కొప్పిశెట్టి దర్శకుడిగా వ్యవహరించాడు. ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, శ్రీచరణ్ పాకాల సంగీతాన్ని అందించాడు. ఈ నెల 30వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. నాని ముఖ్య అతిథిగా వచ్చిన ఈ వేడుకలో హీరో సత్యదేవ్ తనదైన స్టైల్లో మాట్లాడాడు.
“చిత్రపరిశ్రమ అనేది ఒక ఓపెన్ యూనివర్సిటీ వంటిది. అయితే ఇక్కడ మార్కులు లాంటివి ఉండవు. ఇక్కడ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలంటే కావలసినది క్వాలిఫికేషన్ కాదు .. ప్యాషన్. ఆ ప్యాషన్ తోనే ఇక్కడికి రావాలి. అలా వచ్చినప్పటికీ సక్సెస్ రేటు వన్ పర్సెంట్ మాత్రమే ఉంటుందని నూటికి 99మంది చెబుతారు. కానీ ఎవరో ఒకరు ఏం ఫర్లేదు నువ్వు ముందుకు వెళ్లు అని ధైర్యాన్ని ఇస్తారు. అలా ధైర్యాన్ని ఇచ్చేసి ఎవరో కాదు .. మనకు మనమే.
అలా తనకి తానుగా ధైర్యాన్ని చెప్పుకుని ఇండస్ట్రీలో ఎదిగినవారిలో నాని ఒకరు. నాని తనకి తానుగా ఎదిగి ఇండస్ట్రీలోకి వచ్చిన వారికి ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు. నానీని ఆదర్శంగా తీసుకుని ఇండస్ట్రీలో అడుగుముందుకు వేసేవారు చాలామందే ఉన్నారు. నా ఫస్టు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఇది. దానికి నాని గెస్టుగా రావడం నాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. ఇక ‘తిమ్మరుసు‘ విషయానికొస్తే, కథాకథనాలు చాలా కొత్తగా ఉంటాయి. సినిమా చూసిన తరువాత మీరు కూడా అదే మాట చెబుతారు. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ ఇస్తుందనే నమ్మకంతో ఉన్నాను” అని చెప్పుకొచ్చాడు.
Must Read ;- దూకుడు మీదే ఉన్న సత్యాదేవ్!











