(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్రంలో మత్స్యకారుల జీవన ప్రమాణాలను మెరుగు పరిచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Also Read:-ఏపీలో 26వ జిల్లా ఏమిటో తెలుసా?
రెండేళ్లు గడవక ముందే ..
అధికారం చేపట్టి రెండేళ్లు కూడా గడవక ముందే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను 92 శాతం నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నని ధర్మాన కృష్ణదాస్ అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వని హామీలను సైతం నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్నారని తెలిపారు. రూ.3వేల కోట్ల వ్యయంతో 8 ఫిషింగ్ హార్బర్లు, రూ. 225 కోట్ల వ్యయంతో అవసరమైనచోట నియోజకవర్గానికి ఒక ఆక్వా హబ్ నిర్మాణం చేట్టనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా నాలుగు ఫిషింగ్ హార్బర్‌లు, 25 ఆక్వా హబ్‌ల నిర్మాణానికి ప్రభుత్వం సంకల్పించిందని, ముఖ్యమంత్రి కూడా వాటికి శంకుస్థాపన చేశారని ఆయన చెప్పారు.
Also Read:-జగన్ ధిక్కరణకు రెండే దార్లు.. రణమా? శరణమా?
శ్రీకాకుళం జిల్లాలో ..
శ్రీకాకుళం జిల్లాలో ఉన్న విశాలమైన 193 కిలోమీటర్ల సముద్ర తీరాన్ని కూడా అన్ని రకాలుగా వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని, అందులో భాగంగానే భావనపాడు పోర్టు నిర్మాణం, మూడు చోట్ల జట్టీల ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు.











