ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ కేసులో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిపై ఈడీ గురువారం నాడు ఛార్జీషీటు దాఖలు చేసింది. ఈ ఛార్జీషీట్లో రేవంత్‌రెడ్డిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. రేవంత్‌తో పాటు వేం కృష్ణ కీర్తన్‌రెడ్డి, సెబాస్టియన్ల ప్రమేయం ఉందని తెలిపింది. ఏసీబీ ధర్యాప్తు ఆధారంగా ఈడీ చార్జీషీటు దాఖలు చేసింది. చంద్రబాబు ప్రమేయం ఎక్కడా లేన్నట్లు తేలింది. వీడియోల ఆధారంగా రేవంత్ రెడ్డినే ప్రధాన నిందితుడిగా చేర్చింది. ఇక చార్జీషీటు దాఖలు, ఇతర అంశాలను కోర్టు పరిశీలించి నిర్ణయం తీసుకుంటుంది. 2015లో తెలంగాణలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో ఓటుకు నోటు వ్యవహరం వెలుగుచూసింది.
Must Read ;- ప్రధాన నిందితుడు రేవంత్‌రెడ్డే.. ఓటుకు నోటు కేసులో ఛార్జిషీటు దాఖలు











