సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయంటూ ఆ సంస్థ ఛైర్మన్ దూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. మంగళగిరి ఏసీబీ కోర్టు తీర్పు మేరకు దూళిపాళ్లను ముందుగా రాజమండ్రి జైలుకు రిమాండ్‌కు పంపించారు. విచారణ కోసం కస్టడీలోకి తీసుకున్న ఏసీబీ తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏసీబీ కస్టడియల్ విచారణకు హైకోర్టు బ్రేక్ వేసింది.ఏసీబీ కోర్టు అనుమతి మేరకు ఐదురోజులు దూళిపాళను కస్టడీలోకి తీసుకున్న మొదటి రోజే, హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్
ఈ కేసులో నరేంద్ర తరపు న్యాయవాదులు హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ మూవ్ చేశారు. ఐదు రోజులు ఏసీబీ కస్టడీకి ఇవ్వడం నిబంధనలకు విరుద్దమని న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీంతో ఏసీబీ కస్టడీని నిలిపివేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది. సోమవారం దూళిపాళ్ల కేసులో హైకోర్టు పూర్తి విచారణ చేపట్టనుంది. హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారుల విచారణకు బ్రేక్ పడింది. దీంతో ఇవాళ దూళిపాళ నరేంద్రను మరల రాజమండ్రి జైలుకు తరలించే అవకాశం ఉంది.
Must Read ;- ఐదు రోజుల కస్టడీకి ధూళిపాళ్ల : కంటతడి పెట్టిన కూతురు











