స్థానిక ఎన్నికలకు ప్రభుత్వం సిద్దంగా లేదని ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తేల్చి చెప్పినా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దూకుడు తగ్గించలేదు. తాజాగా ఇవాళ నిమ్మగడ్డ రమేష్ కుమార్, సీఎస్ కు మరో లేఖ రాశారు. ప్రవర్తనా నియమావళి కేవలం గ్రామీణ ప్రాంతాలకే వర్తిస్తుందని ఆ లేఖలో పేర్కొన్నారు. పట్టణాలు, నగరాల్లో నియమావళి అమల్లో ఉండదని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో సభలు నిర్వహించి గ్రామీణ ప్రాంతాల ప్రజలకు లబ్దిచేకూరే పనులు చేయవద్దని లేఖలో సూచించారు. ఇలా చేస్తే ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్టవుతుందని లేఖలో తెలిపారు.
ఏపీలో స్థానిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 17 వరకు మొత్తం నాలుగు దశల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని ఎన్నికల్ సంఘం ప్రకటించింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ నుంచే ఏపీలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వస్తుందని నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
Must Read ;- స్థానిక ఎన్నికలు ఇప్పట్లో జరపలేమని తేల్చిన సీఎస్