ఏపీ స్థానిక ఎన్నికల్లో గంటకో ట్విస్ట్ అన్నట్లుంది. తీర్పు వెలువడం ఆలస్యం.. ఎన్నికల కమిషన్ తగిన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూల్ చేసింది. మొదటి దశ ఎన్నికలను నాలుగో దశకు మార్చింది. మిగిలిన మూడు దశలు యథాతథం అని ఎన్నికల కమిషన్ తెలిపింది. దీని ప్రకారం రెండో దశ.. మొదటి దశగా.. మూడు, నాలుగు దశల్లో జరగాల్సిన ఎన్నికలు రెండు, మూడు దశల్లో నిర్వహించి.. మొదటి దశను నాలుగో దశలో జరపనున్నట్లు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు సిద్ధం కానందున రీషెడ్యూల్ చేసినట్లు తెలిపింది. మొదటి దశ నోటిఫికేషన్ వచ్చే నెల 10న విడుదల చేసి ఫిబ్రవరి 21న ఎన్నికలు జరపనున్నట్లు ప్రకటన విడుదల చేశారు. తాజా షెడ్యూల్ ప్రకారం, ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరగనుంది.
Must Read ;- కేంద్రానికి.. నిమ్మగడ్డ లేఖ..