ఇదేం కొత్త విషయం కాదు. దేశంలో ఇన్ని సార్లు ఏ డీజీపీ కూడా కోర్టుకు ఇన్ని సార్టు హాజరై ఉండరు. బహుశా ఆ రికార్డ్ మన ఏపీ డీజీపీ గౌతమ్ గారికే వర్తిస్తుంది. ఇప్పటికే ఎన్నో సార్లు కోర్టు మొట్టికాయలు తిన్న డీజీపీ గారికి.. తాజాగా మరో మొట్టికాయ పడింది. కాకపోతే ఈసారి ఒక్కరిగా కాకుండా డీజీపీ గారితోపాటు ప్రభుత్వ హోంసెక్రటరీ డీజీపీకి జతయ్యారు.
ఏంటి.. ఎన్నికలా?
ఇక విషయంలోకి వెళ్తే.. ఒక పోలీసు అధికారి పదోన్నతి విషయంలో నిర్లక్ష్యంగా వ్యహరించారంటూ దాఖలైన పిటిషన్‌లో కోర్టు ధిక్కరణ కింద ఈ రోజు (జనవరి 25) కోర్టుకు హాజరు కవాలని డీజీపీకి, హోంసెక్రటరికి గతంలో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఎన్నికల విధుల్లో ఉన్నందున హాజరుకాలేమని కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేశారు వారిరువురు. దీనిపై ఆగ్రహించిన కోర్టు, సుప్రీం తీర్పు వెలువరించేంతవరకూ అన్ని నిలిపివేయాలని సిఎస్ ఆదేశించిన విషయం గుర్తుచేస్తూ.. మీరేమో ఎన్నికలు అంటూ సాకులు చెప్తున్నారని తప్పుబట్టింది. ఈ నెల 27న కోర్టుకు తప్పకుండా హాజరుకావాలని డీజీపీకి, హోం సెక్రటరీకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఎంతటి అంకిత భావమో!
డీజీపీ, హోం సెక్రటరీ.. కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ చూస్తే.. ఎంతటి అంకిత భావమో అనిపించక మానదు. ఎన్నికల పనుల్లో ఎంతగా నిమగ్నమయ్యారో పాపం అనిపించకమానదు. కానీ, వాస్తవాలు వేరుగా ఉన్నాయి. ఎన్నికలపై రాష్ట్రంలో ప్రతిష్ఠంబన ఏర్పడిన సంగతి తెలిసిందే. మరి ఈ సంగతిని కోర్టు గమనించకుండా ఉంటుందని, ఎన్నికల విధులని అబద్దంతో కూడిన అఫిడవిట్ వేస్తే కోర్టు గ్రహించకుండా ఉంటుందని భావించడం హస్యాస్పదం. ఒక రాష్ట్ర పోలీసు శాఖ అధినేత అయుండి కోర్టుకు హాజరు కాకుండా తప్పించుకోవడానికి ఇలాంటి తప్పుడు అఫిడవిట్ దాఖలు చేయడం వల్ల పోలీసు వ్యవస్థ పట్ల ప్రజలకు ఎలా నమ్మకం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు, పోలీసుల పట్ల ఏ పాటి గౌరవం ఉంటుందని అడుగుతున్నారు. ఎవరేమన్నా మనకేం పట్టింపు లేదనుకుంటే ఎలాగైనా ఉండచ్చన్నట్లు ప్రవర్తిస్తున్న అధికారుల తీరు పట్ల ప్రజలు పెదవి విరుస్తున్నారు.
Must Read ;- సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?