ఏపీ స్థానిక ఎన్నికల విషయంలో ఒక స్పష్టత లభించింది. ఎన్నికలు నిలిపివేయాలంటూ ఏపీ ప్రభుత్వం, ఉద్యోగ సంఘాలు వేసిన పిటిషన్‌ను సుప్రీం కొట్టివేస్తూ.. ఎన్నికలు కొనసాగించాలని తీర్పునిచ్చింది.
ఏపీలో స్థానిక ఎన్నికలు జరపడానికి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఉద్యోగ సంఘాలు, ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ముందు ప్రకటించినట్లుగా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెల 23న విడుదల చేశారు. దానిపై ఉద్యోగ సంఘాలు, నాయకులు భగ్గుమన్నారు. నేడు (జనవరి 25) సుప్రీం కోర్టులో ఉద్యోగ సంఘాలు, ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్లు జస్టిస్ సంజయ్ కౌల్ ధర్మాసనం విచారంచింది. ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. గోవా సహా పలు రాష్ట్రాల్లో ఎన్నికలు వాయిదా పడ్డాయని తెలిపిన ప్రభుత్వం తరపు లాయర్. కాగా, ఏప్రిల్ మొదటి వారం వరకు ప్రభుత్వానికి సమయమివ్వాలని కోరిన లాయర్ ముకుల్. వ్యాక్సినేషన్ అందిస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల విధులు నిర్వహించలేమని కోర్టుకు తెలిపిన ఉద్యోగ సంఘాలు. అందువల్ల మూడు నెలల పాటు ఎన్నికలు వాయిదా వేయాల్సిందిగా కోరారు. వ్యాక్సినేషన్ స్థానిక ఎన్నికల నిర్వహణకు అడ్డురాదని తెలిపిన ఎన్నికల కమిషన్.
అందరి వాదనలు విన్న ధర్మాసనం రెండు బలమైన శక్తుల మధ్య జరిగే సమస్య వల్ల న్యాయ భద్రతకు సమస్య తలెత్తుతుంది. ఎస్‍ఈసీ విధుల్లో భాగంగానే ఎన్నికల ప్రక్రియ. దేశంలో ఎక్కడా ఎన్నికలు జరగడం లేదా? ఏదో వంకతో ఎన్నికలు ఆపాలని చూస్తున్నారు. ఎన్నికలు రాజకీయ ప్రక్రియలో భాగం స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసిన సుప్రీం కోర్టు. స్థానిక ఎన్నికల నిలుపుదలపై వేసిన రెండు పిటిషన్లు కొట్టి వేయడంతోపాటు, ఎన్నికలకు సహరించాల్సిందిగా ఉద్యోగులను, ప్రభుత్వాన్ని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
Musdt Read ;- వెంకట్రామిరెడ్డి.. ఉద్యోగుల హక్కులనూ ‘చంపే’స్తున్నారా?