ఎన్నికల నిర్వహణకు సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్, పంచాయతీ ఎన్నికల రీషెడ్యూల్ విడుదల చేసింది. అంతేకాదు, సహకరించని ఉద్యోగ సంఘాల గురించి పట్టించుకోకూడదని కూడా నిర్ణయించింది. ఎన్నికల నిర్వహణకు సహకరించబోమని కొన్ని ఉద్యోగ సంఘాలు చెబుతున్న నేపథ్యంలో, ఎన్నికల కమిషనర్, కేంద్ర హోం సెక్రటరీకి లేఖ రాశారు. ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్ర సిబ్బందిని కేటాయించాలని కోరుతూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ లేఖ రాశారు.
ఇంకోవైపు, ఈరోజు సాయంత్రం జిల్లా కలెక్టర్లుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ ప్రకటించారు. ఎన్నికలకు కావలిసిన ఏర్పాట్లను సమీక్ష నిర్వహించడానికి ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది. కలెక్టర్లందరూ హాజరు కావాలని ఆదేశించారు.
Must Read ;- సుప్రీం సంచలన వ్యాఖ్యలు.. సంఘ నేతల వైఖరి ‘మారాల్సిందే’..?