మెగాస్టార్ మేనల్లుడు, సాయిధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడం తెలిసిందే. ఈ సినిమా ద్వారా సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అయ్యారు. విభిన్న ప్రేమకథా చిత్రంగా రూపొందిన ఉప్పెన సంచలన విజయం సాధించింది. దాదాపు 35 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఉప్పెన సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. చిన్న సినిమాల్లో పెద్ద విజయం సాధించి సరికొత్త రికార్డ్ సాధించింది. ఈ సినిమా తర్వాత హీరో వైష్ణవ్ తేజ్ కు డిమాండ్ బాగా పెరిగింది.
రెండో సినిమాగా వైష్ణవ్ తేజ్ క్రిష్ తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది. ఇందులో వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటించింది. ఈ సినిమాను త్వరలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా తర్వాత వైష్ణవ్ తేజ్ తో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ ప్రేమకథా చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై రూపొందే ఈ సినిమాకి సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఈ చిత్రం ద్వారా పృథ్వీ దర్శకుడిగా పరిచయం కానున్నారు.
స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా రూపొందుతోంది. ఇక అసలు విషయానికి వస్తే.. ఈ సినిమాకు గాను నాగార్జున వైష్ణవ్ తేజ్ కు 5 కోట్లు రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారని సమాచారం. ఉప్పెన తర్వాత వైష్ణవ్ తేజ్ కి ఏర్పడిన డిమాండ్ కి తగ్గట్టుగా నాగార్జున భారీగా 5 కోట్లు రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సాధిస్తాడో చూడాలి.
Must Read ;- హీరోగా రాబోతున్న ఎన్టీఆర్ బావమరిది











