తెలంగాణలో లాక్ డౌన్ ఆలోచనే లేదని హెల్త్ మినిస్టర్ ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం పాటిస్తుందని, అయితే కేంద్రం ఇప్పటి వరకు కరోనా విషయంలో రాష్ట్రలకు పెద్దగా చేసింది ఎం లేదని ఆరోపించారు. కేంద్రం చేయాల్సిన తప్పులన్ని చేసి రాష్ట్రాలను నిందించడం సరికాదని ఆయన తెలిపారు. కేంద్రం చెప్పిన మాటల్లో వాస్తవాలు ఉంటే ఢిల్లీతో పాటు అనేక రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సమాదానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 18 ఏళ్ళు పైబడిన యువకులు 1.7 కోట్ల మంది ఉన్నారని….వీళ్లకు రెండు డోసుల చొప్పున మూడు కోట్ల డోసులు అవసరం ఉన్నాయని చెప్పారు. కొన్ని విషయాల్లో కేంద్రం సరిగ్గా స్పందించడం లేదన్నారు. మే 1 నుంచి అందరికీ వాక్సిన్ ఇవ్వలేమని ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ అన్నారు.
Must Read ;- తెలంగాణలో అందరికీ ఫ్రీ వ్యాక్సిన్ : సీఎం కేసీఆర్ నిర్ణయం