ఫ్రంట్ లైన్ వారియర్ లక్ష్మీ అపర్ణ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై మాజీ ఎంపీ హర్ష కుమార్ మండిపడ్డారు. గతంలో డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు ఎలా వ్యవహరించారో.. లక్ష్మీ అపర్ణ పట్ల అలాగే వ్యవహరించారని అన్నారు. ఒక ఆడపిల్ల అని చూడకుండా, కొవిడ్ వారియర్ అని తెలిసినా పోలీసులు దురుసుగా వ్యవహరించడం సరికాదన్నారు. బయట ఎంతోమంది విచ్చలవిడిగా తిరుతుంటే.. విధులకు వెళ్లి వస్తున్న యువతిని బలవంతంగా లాకెళ్లారని ఆరోపించారు. ఇలాంటి ఘటనలకు డీజీపీ, సీఎం జగన్ బాధ్యత వహించాలని హర్ష కుమార్ అన్నారు.
Must Read ;- ఇదేనా మహిళలకు ఇచ్చే గౌరవం?: వంగలపూడి అనిత











