ఆనందయ్య అనే బాల్‌ను ఎటో కొట్టారు. ఆ బాల్‌ను పట్టుకోవడానికి ఫీల్డర్లంతా గ్రౌండంతా ఆగమాగం చేసుకుంటూ రచ్చ చేస్తుండగానే… ఈలోపే వైసీపీ బ్యాట్స్‌మెన్లు ఫుల్లు పరుగులు తీసుకున్నారు.. అదే ఆ మందు మింగేశారు.అవును అందరితో దాగుడుమూతల దండాకోర్ అంటూ ఆడుతూ…వైసీపీ నేతలు,వారి గణం అంతా ఆనందయ్య మందు ఎంచక్కా వేసేసుకున్నారు.
రూటు మార్చి కాలం గడిపారు..
ముందు ఆ మందు బ్రహ్మాండం అన్నారు.. ఆ తర్వాత రూటు మార్చి ఆ మందు పని చేస్తుందో లేదో చూడాలన్నారు…దాని కోసం రోజులు గడిపేశారు.. ఆ తర్వాత తీరిగ్గా అది వాడొచ్చు.. ఆయుర్వేదం అయితే కాదన్నారు. ఆనందయ్య ఇన్నిరోజులు ఎవరికీ చిక్కకుండా,దొరక్కుండా ఉన్నారు. పోలీసుల అదుపులో ఉన్నారని కొన్నాళ్లు..కాదు కాదు వైసీపీ నేతల ఆశ్రయంలో ఉన్నారని కొన్నాళ్లు వార్తలొచ్చాయి. అన్నిటినీ ఆనందయ్యగారు ఖండించారు. కాని కరోనా ప్రాణాలు మింగేస్తుంటే.. అందరూ ఈ మందు కోసం ఆశగా ఎదురు చూస్తున్న సంగతి అందరికీ తెలుసు. కాని ఈ తతంగం నడిచినన్నాళ్లు ఆనందయ్య మందు తయారు చేస్తూనే ఉన్నారు…వైసీపీ నేతలు, వారి మీడియా సిబ్బంది.. వారి తాలూకా వారు..అందరూ ఆ మందు వాడేశారు. కెమెరాల సాక్షిగా తిరుపతిలో కనపడ్డా… సర్వేపల్లిలో కనపడ్డా..ఏదీ ఆనందయ్య ఒప్పుకోలేదు.
Must Read ;- చేతులెత్తేసిన ప్రభుత్వం : ఆనందయ్య మందు పంపిణీ ప్రశార్థకం
అధికారికంగా మందు పంపిణీ ప్రారంభం అనగానే..
ఇప్పుడు అధికారికంగా ఆనందయ్య మందు పంపిణీ ప్రారంభం అనగానే ఓ వెబ్ సైట్ పెట్టారు. ఆ సైట్ రహస్యాలు టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి చిక్కడంతో అది కూడా రచ్చ అయింది..అవుతోంది. ముందు నెల్లూరు జిల్లా..తర్వాత మిగతా జిల్లాలని ఆనందయ్య ప్రకటించారు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కడప రవీంద్రనాథ్ రెడ్డి, కాకాని గోవర్ధన్‌రెడ్డి వారివారి నియోజకవర్గాల్లో మందు తయారు చేయించారు. అదేమంటే.. ఒక చోట తమ్ముడు, మరో చోట కొడుకు..ఇంకో చోట అనుచరుడు మందు చేస్తున్నారని ఆనందయ్య వర్గం చెప్పుకొచ్చింది. మళ్లీ ఎందుకొచ్చిందనుకున్నారో.. తాను కాకుండా ఇంకెవరూ చేయరని..చేస్తున్నోళ్లకు తన అనుమతి లేదని ఆనందయ్య చాటి చెప్పాడు.
చిన్నపిల్లలాటలాగా..
ఒక మందు హానికరంగా కాదు, పని చేసే అవకాశముంది… జనం వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిసినప్పుడు.. ఈ కరోనా సమయంలో దానిని ఎంత జాగ్రత్తగా ఆర్డనైజ్ చేయాలి.. కాని ఏపీ ప్రభుత్వం దానిని చిన్నపిల్లలాటలాగా మార్చిపడేసింది.ఎవరిష్టం వారిదన్నట్లు … ఆనందయ్య ఎవరి ఫోన్ ఎత్తితే..వారికే మందు అన్నట్లు.. ఆయన అసలు వైసీపీ నేత అయినట్లే వ్యవహారం నడిపిస్తున్నారు. చేసేదంతా వైసీపీ నేతలు.. మాటిమాటికీ మీడియా ముందుకొచ్చి ఆనందయ్య వివరణ ఇచ్చుకోవడం కామన్ అయిపోయింది.
ప్రభుత్వం గాని, ముఖ్యమంత్రి గాని ఇవన్నీ కంట్రోల్ చేసి..ఒక పద్ధతి ప్రకారం చేయకపోతే కరోనా కన్నా.. ఇదో పెద్ద డేంజరస్ ఎపిసోడ్ అవుతుంది. కాని ఇంతమంది నేతలు ఓపెన్‌గాMust మందు పంపిణీకి ఎవరితో సంబంధం లేకుండా చేస్తున్నారంటే.. వారికి సీఎం అనుమతి లేకపోతే అంత ధైర్యంగా చేయగలరా అనే ప్రశ్న కూడా వస్తుంది. అందుకే ఆనందయ్య మందు పంపిణీ.. ఎన్నాళ్లు జరుగుతుందో…ఎన్ని రకాలుగా జరుగుతుందో చూస్తూ ఉండాల్సిందే.
Also Read ;- ఆనందయ్య కంటి మందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్











