బాలీవుడ్, టాలీవుడ్ నటుడు సోనూ సూద్ కు అపర దానకర్ణుడు అనే బిరుదును కరోనా ప్రసాదించింది. ఆయన కనిపిస్తే చాలు స్వాగత సత్కారాలు జరిగిపోతున్నాయి. తాజాగా ‘ఆచార్య’ చిత్రం షూటింగులో సోనూకు ఇలాంటి సత్కారాలే లభించాయి. ఈ సినిమా దర్శకుడు కొరటాల శివ, నటుడు తనికెళ్ల భరణి సోనూను సత్కరించారు. ఈ షూటింగులో పాల్గొనాల్సి రావడంతో సోనూ సూద్ సెట్ కు వచ్చారు.

రాగానే అతనికి ప్రశంసల జల్లు కురిసింది. రియల్ హీరో అని అందరూ కొనియాడారు. పైగా మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా సెట్ ఇది. ఈ సినిమాలో సోనూ సూద్ మీద కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉంది. షూటింగులోకి ఇంకా మెగాస్టార్ అడుగుపెట్టలేదు. ఇతర తారాగణంపై కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా సోనూ సూద్ కు శాలువా కప్పి తనికెళ్ల భరణి, దర్శకుడు కొరటాల శివ సత్కరించారు.
తనికెళ్ల భరణి మాట్లాడుతూ ఈ కలియుగంలో ఇలాంటి దానకర్ణులు బహు అరుదుగా ఉంటారని కొనియాడారు. ఇంత విపత్కర పరిస్థితుల్లో ఇలాంటి సేవాకార్యక్రమాలకు పూనుకోవడం చాలా గొప్ప విషయమని అన్నారు. సోనూ ఓ హనుమంతుడి విగ్రహాన్ని కూడా బహూకరించారు.
Must Read ;- మరో పసివాడ్ని కాపాడడానికి ముందుకొచ్చిన సోనూ సూద్











