తమన్నాకు సినిమా అవకాశాలు తగ్గటం ప్రారంభం కాగానే ఆమె తెలివిగా వెబ్ సిరీస్ దిశగా అడుగులు వేసింది. సినిమాల పరంగా చూస్తే గోపీచంద్ హీరోగా రూపొందిన ‘సీటీమార్’లో నటించింది. లెవన్త్ అవర్ అవర్ వెబ్ సిరీస్ ఓటీటీలో ఉండగానే మరో వెబ్ సిరీస్ ను కూడా అంగీకరించింది. దీనిపేరు ‘నవంబర్ స్టోరీ’ అట. తమిళ దర్శకుడు ఇంద్ర సుబ్రమణియన్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. దీని షూటింగ్ కూడా పూర్తయింది. ఇది ఈ నెల 20 నుంచి ప్రసారం కానుంది కూడా.
డిస్నీప్లస్ హాట్ స్టార్ వీఐపీలో ఈ వెబ్ సిరీస్ ప్రసారమవుతుంది. హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ వెబ్ సిరీస్ ను చూడవచ్చు. దీనికి ముందు ఆమె నటించిన ‘లెవన్త్ అవర్’ ఆహా ఓటీటీలో విడుదలైంది. దీనికి ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. ఇది సూపర్ హిట్ కాకపోయినా యావరేజ్ స్పందన వచ్చింది. మరో ఐదు రోజుల్లో నవంబర్ స్టోరీ ప్రసారమవుతుంది. పాత్ర ఎలాంటిదైనా ఆమె ఓకే అనేస్తోంది.
నవంబర్ స్టోరీ తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని ఆమె అంటోంది. ఒక విధంగా చెప్పాలంటే ఆమె సేఫ్ జోన్ లో ప్రయాణిస్తోంది. సినిమా పరిశ్రమ కోలుకుని షూటింగులు ప్రారంభం కావడానికి చాలా సమయమే పట్టేటట్లు కనిపిస్తోంది. ఈ లోగా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా తమన్నా అడుగులు వేస్తోంది. సీటీమార్ లో ఆమె తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుందట.
Must Read ;- రాజశేఖర్, గోపీచంద్ మల్టీస్టారర్.. నిజమేనా?