రాష్ట్రంలో పది, ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల రద్దుకు హోంమంత్రి అమీత్ షాకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. దేశంలోని దాదాపు 14 రాష్ట్రాలతో పాటు ఐసిఎస్‌ఇ, సిబిఎస్‌ఇ బోర్డులు పరీక్షలు రద్దు చేశాయని, ఏపీ ప్రభుత్వం మాత్రం విరుద్ధంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 6.7 లక్షల మంది విద్యార్థులకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేసుందని తెలిపారు. గత ఏడాది మార్చి నుంచి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురైన విద్యార్థులు పరీక్షలు రాసేందుకు సిద్ధంగా లేరని వివరించారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను తీసుకొని, కేంద్రం నిర్ణయం తీసుకోవాలని నారా లోకేశ్ అన్నారు.
Must Read ;- నాడు పరీక్షల రద్దుపై, నేడు APPSC అక్రమాలపై.. మరో ఉద్యమానికి లోకేష్ సిద్ధం











