హైద్రాబాద్ లో ఒకో ఏరియాలోనూ ఒకో పురాతన థియేటర్ ఉంది. మన తాత, ముత్తాతల కాలం నుంచి అవి ప్రేక్షకుల్ని సినిమాలతో మురిపిస్తూనే ఉన్నాయి. ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్ సినిమాల కాలంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఆ సినిమా థియేటర్స్ ఇప్పుడు శాశ్వతంగా మూతపడడం సినీ ప్రేమికుల్ని బాధిస్తోంది. నగరంలో మొత్తం 5 సింగిల్ స్ర్కీన్ థియేటర్స్ ను ఇప్పుడు శాశ్వతంగా మూసివేశారు. కోవిడ్ 19 లాక్ డౌన్ వల్ల బాగా నష్టాలు రావడమే దీనికి కారణమని తెలుస్తోంది.
నారాయణ గూడలోని శాంతి థియేటర్, టోలీచౌక్ లో ని గేలాక్సీ థియేటర్, బహదూర్ పూర లోని శ్రీరామ థియేటర్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని మయూరి థియేటర్, మోహిదీపట్నంలోని అంబా థియేటర్ ను శాశ్వతంగా మూసివేయడం గమనార్హం. ఇకపై వీటిని గొడౌన్స్ గానూ, వ్యాపార అవసరాల కోసం వినియోగించబోతున్నారని సమాచారం.
Must Read ;- తెలంగాణలో థియేటర్లకు గ్రీన్ సిగ్నల్











