హీరోగా సునీల్ కు ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టిన సినిమా ‘మర్యాద రామన్న’. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా అప్పట్లో చాలా చిన్న సినిమాగా తెరకెక్కి అత్యధిక వసూళ్ళు రాబట్టింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికి పదేళ్ళు అయిపోతోంది. అందులో సునీల్ కు జోడీగా సలోని నటించి మెప్పించింది. తెలుగమ్మాయి అంటూ అందాలు ఒలికించింది. ఇప్పుడు మరోసారి సునీల్ సలోనీ జంట ప్రేక్షకుల్ని అలరించడానికి సిద్ధమైందని వార్తలొస్తున్నాయి.
‘మనసంతా నువ్వే’ మూవీతో టాలీవుడ్ డైరెక్టర్ గా ప్రవేశించి.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు వియన్ ఆదిత్య. ఈ సినిమాలో సునీల్ మీద రన్ అయిన కామెడీ ట్రాక్ అప్పట్లో ఎంతో హిట్టయింది. సునీల్ కూడా అప్పుడే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. ఈ సినిమా విజయంలో సునీల్ పాత్ర కూడా ఎంతో ఉండడంతో .. ఆదిత్యకి, సునీల్ కు అప్పట్లో మంచి ఫ్రెండ్ షిప్ ఏర్పడిందట. ఇప్పటికీ వారిద్దరి మంచి రిలేషన్స్ కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే ఇటీవల ఈ ఇద్దరి కలయికలో ఒక సినిమా ప్రారంభమైంది.
సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో సునీల్ సరసన మరోసారి సలోని అలరించబోతోంది. వెంకీ , త్రిష నటించిన ‘బాడీగార్డ్’ లో నటించిన ఒక ముఖ్య పాత్ర పోషించిన సలోని ఆ సినిమా తర్వాత అంతగా కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడిలా ఈ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వనుండడం విశేషంగా మారింది. అప్పట్లో హిట్ పెయిర్ అవడం వల్లనే సునీల్ , సలోని ని మళ్ళీ దర్శకుడు ఆదిత్య కలిపినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయాలని అనుకున్నారు. అయితే థియేటర్స్ త్వరలోనే ఓపెన్ అవుతున్న కారణంగా నిర్ణయాన్ని మార్చుకున్నారట నిర్మాతలు. వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా వియన్ ఆదిత్య, సునీల్ ఇద్దరూ బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.
Must Read ;- అడ్వాన్స్ తిరిగిచ్చేసిన ఉప్పెన దర్శకుడు.. నిజమేనా?