కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలో అతిసార వ్యాధి పంజా విసిరింది. ఇప్పటికే వాంతులు, విరోచనాలతో నలుగురు మరణించారు. నంద్యాల పట్టణంలోని అరుణజ్యోతి నగర్‌తో పాటు, ఆదోని సమీపంలోని గోరకల్లులో అతిసార వ్యాధికి నలుగురు బలయ్యారు. మరో 30 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి సరఫరా అవుతున్న మంచినీరు కలుషితం కావడం వల్లే అతిసార వ్యాపించిందని అధికారులు ప్రాధమికంగా గుర్తించారు.
వైద్య శిబిరం ఏర్పాటు
గోరకల్లు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి బాధితులకు వైద్యం అందిస్తున్నారు. అయితే బాధితుల సంఖ్య పెరగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే డయేరియా బారినపడి నలుగురు చనిపోవడం, మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో జిల్లా వైద్యాధికారులు రంగంలోకి దిగి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కలుషిత మంచినీటి సరఫరా వల్లే అతిసార వ్యాధి ప్రబలినట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.
Must Read ;- ఓర్వకల్లు ఎయిర్ పోర్టు ప్రారంభం : జగన్ ఏ పేరు పెట్టారో తెలుసా!