కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టును సీఎం జగన్మోహన్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేదని, ఇక నుంచి విమాన ప్రయాణం కూడా జరగబోతోందని సీఎం జగన్ తెలిపారు. ఈనెల 28 నుంచి ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని అన్నారు. రూ.110 కోట్లు ఖర్చు చేసి కేవలం ఏడాదిన్నరలోనే పనులు పూర్తి చేశామని సీఎం జగన్ తెలిపారు. ఓర్వకల్లుతో రాష్ట్రంలో ఆరో ఎయిర్‌పోర్టు ప్రారంభమవుతోందని పేర్కొన్నారు. ఈ గడ్డ నుంచే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వచ్చారని తెలిపారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును సీఎం జగన్ ప్రకటించారు.
Must Read ;- ఇసుక సరఫరా కాంట్రాక్ట్‌లో క్విడ్ ప్రోకోనా.. జగన్‌కు సీపీఐ రామకృష్ణ లేఖ











