ఈ నెల 14న సీఎం జగన్ తిరుపతిలో పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. పార్టీ వర్గాలు, ఇంటెలిజెన్స్ నివేదికల ప్రకారం తిరుపతి లోకసభ పరిధిలోని 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి ఆశించిన మేరకు లేదన్న సమాచారం మేరకు స్వయంగా రంగంలోకి దిగాలని ఆయన నిర్ణయించినట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సారి ఆయన ప్రత్యక్షంగా ప్రచారంలో పాల్గొనున్నారు. ప్రచారంలో తాను హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉన్నానని చెప్పే ప్రయత్నం చేయనున్నట్లు సమాచారం.
Must Read ;- తిరుపతి ఉప ఎన్నికపై బాబు ఫోకస్ : త్వరలోనే…