కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ఇప్పటికే కరోనా రోగులకు ఆదుకుంటూ తన మానవత్వాన్ని చాటుకుంటున్నాడు. గాంధీ రోగులకు ఉచిత భోజనం అందిస్తూనే.. బొల్లారంలో కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించించి తనవంతు సాయం చేస్తున్నారు. తాజాగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కరోనా కట్టడికి తనవంతు సాయం చేస్తున్నాడు. గాంధీ భవన్ లో అంబులెన్స్ సేవలను ప్రారంభించిన జగ్గారెడ్డి, ఇకపై సంగారెడ్డిలోనూ సేవలను అందుబాటులోకి తీసుకున్నారు. మొత్తం 8 అంబులెన్స్ అందుబాటులోకి తేనున్నాడు. ఈ సందర్భంగా జగ్గారెడి, ఆయన కుమార్తె మాట్లాడుతూ కరోనా రోగులకుసాయం చేసేందుకే ఫ్రీ అంబులెన్స్ అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఎవరైనా కాల్ చేస్తే రోగులను అంబులెన్స్ ద్వారా సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలిస్తామని, అత్యవసరమైతే హైదరాబాద్ కూడా చేరువేరుస్తామని చెప్పారు. త్వరలోనే రోగుల కోసం సిలిండర్లను సైతం అందిస్తామని చెప్పారు.
Must Read ;- చేయి చేయి కలుపుదాం.. కరోనాను తరిమి కొడదాం : కొవిడ్ ఆస్పత్రిని ప్రారంభించిన రేవంత్ రెడ్డి










