కరోనా సెకండ్ వేవ్ విరుచుకుపడుతున్నవేళ.. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి పేదోడి ప్రాణాలకు భరోసా ఇస్తున్నారు. కొవిడ్ కట్టడి కోసం ఆదివారం ఆయన హైదరాబాద్ బొల్లరంలో ఆస్పత్రిని అందుబాటులోకి తెచ్చారు. నేటి నుంచి కోవిడ్ వైద్య సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ కష్టకాలంలో నా నియోజకవర్గ ప్రజల వైద్య సేవకు ఆసుపత్రి రెడీ అయిందన్నారు. మొదటి దశలో 50 పడకల సౌకర్యంతో పాటు, 50 సిలెండర్ల ఆక్సిజన్, ఇతర వైద్య సిబ్బంది, అవసరమైన మందులు, వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. చేయి చేయి కలుపుదాం. కోవిడ్ మహమ్మారిని తరిమి కొడదాం అంటూ రేవంతరెడ్డి తన అభిమానులకు పిలుపునిచ్చారు. బొల్లారంలో కోవిడ్ ఆస్పత్రిని సేవలను కొనసాగిస్తూనే.. మరోవైపు గాంధీ ఆస్పత్రి దగ్గర కరోనా రోగుల ఆకలి తీరుస్తున్నారు ఎంపీ రేవంత్ రెడి. కరోనా మూడో వేవ్ ఒకవేళ వస్తే.. తనవంతు సాయం చేస్తానని ఆయన ఇప్పటికే ప్రకటించారు.
Must Read ;- ఆపదకాలంలో అండగా : కరోనా బాధితుల కోసం రేవంత్ రెడ్డి హాస్పిటల్
కోవిడ్ కష్టకాలంలో నా నియోజకవర్గ ప్రజల వైద్య సేవకు బొల్లారం ఆసుపత్రి రెడీ అయింది.మొదటి దశలో 50 పడకల సౌకర్యంతో పాటు,50 సిలెండర్ల ఆక్సిజన్,ఇతర వైద్య సిబ్బంది,అవసరమైన మందులు,వ్యాక్సినేషన్ కోసం ఏర్పాట్లు చేశాం.నా నియోజకవర్గంలో ప్రజలకు కష్టకాలంలో ఇది కొంతైనా ఊరటనిస్తుందని ఆశిస్తున్నాను pic.twitter.com/MiFlr4jCaN
— Revanth Reddy (@revanth_anumula) May 23, 2021










