అప్రతిష్ట పాలౌతున్న సీబీఐ ..!
కేంద్ర దర్యాప్తు సంస్థ పరువు ఏపీలో అప్రతిష్టపాలౌతోంది. అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థగా దేశంలోనే పేరున్న సీబీఐ విలువలు మసకబారే పరిస్థితి నెలకొంది. కాకలు తీరినా మాఫియాను, ఆర్థిక నేరగాళ్ల భరతం పట్టే సీబీఐ ఏపీలో సాగుతున్న పలు కేసుల్లో విచారణ చేతకాక చేతులెత్తేస్తోందని ఆరోపణ వెల్లువెత్తున్నాయి. వివేక కేసులో దర్యాప్తును సా… గదీసి, చివరాఖరుకు వచ్చి తరువాత మరో ట్విస్ట్ కు ఎందుకు తెరతీస్తోందో అర్థకాక బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు విన్నవాళ్లంతా. వివేక కేసులో తప్పుడు వాగ్మూలం ఇవ్వమని చెప్పి అనంతపురం జిల్లా యాడికి కి చెందిన గంగాధర్ రెడ్డిని ఒత్తిడి చేయడం, రూ.10 కోట్లు ఇస్తాం.. అలా ఒప్పుకోకుంటే చంపేస్తాం అని సీబీఐ బెదిరిస్తోందని జిల్లా ఎస్పీ ఫకీరప్పను కలిసి ఫిర్యాదు చేశారు. వివేక హత్యకు నాకు సంబంధం లేదని, కానీ కేసులో నన్ను ఇరికించాలని వివేక అనుచరులు, సీఐ శ్రీరామ్, సీబీఐ ఒత్తిడి చేస్తోందని ఎస్పీకి వివరించారు. తనతోపాటు కుటుంబానికి కూడా ప్రాణ హాని ఉందని గంగాధర్ రెడ్డి ఎస్పీకి చెప్పుకున్నారు. ఈ కేసుల్లో ఇప్పటికే డ్రైవర్ దస్తగిరి ఇచ్చిన వాగ్మూలం ప్రకారం దేవిరెడ్డి శంకర్ రెడ్డి అరెస్ట్ చేశారు. కేసును చాలా క్లోజ్ గా మూవ్ అవతున్నారు.. రేపోమాపో కేసును క్లోజ్ చేస్తారని అనుకుంటున్న సమయంలో తెరపైకి గంగాధర్ రెడ్డిని ఎందుకు తీసుకొస్తున్నారు అన్నది తెలియాల్సి ఉంది.
Must Read ;- ఏపీ ఈఎస్ఐ కు వైద్య పరికరాలు నిలిపివేస్తున్నాం..!











