కేంద్రం.. సామాన్యుడి నడ్డి విరుస్తోంది. ఉన్నోళ్లకు అనేక రకాలుగా వెసులుబాట్లు కల్పిస్తున్న కేంద్రం.. సామాన్యుడిపైనే పగబట్టినట్లుగా వ్యవహరిస్తోంది. ఓ వైపు పెట్రోల్ ధరలు భగ్గుమంటుండగా.. ఇప్పుడు గ్యాస్ బండ కూడా సామాన్యుడికి గుదిబండలా తయారవుతోంది. రెండు నెలల క్రితం వరకు రూ. 650గా ఉన్న ధర.. రెండు విడతల్లో రూ. 100 పెరిగి 750కి చేరింది. ఇప్పుడు తాజాగా పెట్రో కంపెనీలు మరో రూ. 25 పెంచడంతో రూ. 775కి చేరుతోంది. కమర్షియల్ గ్యాస్ ధర రూ. 124 పెరిగింది. తాజా ధరలు గురువారం (ఫిబ్రవరి 4) నుంచే అమల్లోకి వస్తున్నాయి.
నిర్మలా సీతారామన్ తాజాగా ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో పెట్రోలియం ఉత్పత్తులపై సబ్సిడీ తగ్గించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందని పెట్రో కంపెనీలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగు కొనసాగితే.. గ్యాస్ ధరలు అతి త్వరలోనే వెయ్యి మార్కును చేరుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
Must Read ;- మంట పుట్టిస్తున్న పెట్రోల్.. పోటీపడుతున్న ఏపీ











