కరోనా కారణంగా ఎన్నో ఒడిదుడుగులను ఎదుర్కోన్న దేశాలని ఈ బడ్జెట్ ఎంతో కీలకమైనది. ముఖ్యంగా చిన్న, మధ్య స్థాయి పరిశ్రమలు బడ్జెట్‌లో రాయితీలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అంతేకాదు.. ఆర్థికంగా కుదేల వ్యాపార రంగాలు కూడ కేంద్ర బడ్జెట్ కారణంగా పెరిగే ధరలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇక సామాన్యుడి విషయానికొస్తే, పన్నులు, వడ్డీలు, రుణాలు, రేట్లు.. వీటిపై వారి దృష్టంతా ఉంది. మరి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల మరింత ప్రియంగా మారనున్న వస్తువులేమిటో.. ధరలు తగ్గనున్న వస్తువులేమిటో చూద్దాం.
పెరిగే అవకాశాలు ఉన్నాయి..
- మొబైల్ రేట్లు పెరిగే అవకాశం.
- దిగుమతి చేసిన దుస్తులు, కాటన్ దుస్తుల ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు నిపుణులు.
- కార్ల విడి భాగాల ధరలు పెరగనున్నాయి.
- పెట్రోలు, డీజిల్ ధరలు బాగా పెరిగాయి. లీటర్ పెట్రోలు పై రూ. 2.50, లీటర్ డీజిల్ పై రూ.4 వ్యవసాయ సెస్.
- ఆల్కాహాల్‌పై 100 శాతం అగ్రి సెస్.
వీటిలో తగ్గుదల ఉంటుంది..
- నైలాన్ దుస్తుల ధరలు తగ్గవచ్చు.
- తగ్గనున్న బంగారం, వెండి ధరలు.
- స్టార్టప్ కంపెనీలకు పన్ను రాయితీ పొడిగించిన కేంద్రం.
- Must Read ;- టీమిండియాకు ఆర్థిక మంత్రి ప్రశంసలు.. క్రీడలకు మొండిచేయి