యాక్షన్ హీరో గోపీచంద్ , కామెడీ ఎంటర్ టైనర్స్ స్పెషలిస్ట్ మారుతి కాంబినేషన్లో ప్రస్తుతం పక్కా కమర్షియల్ అనే మూవీ రూపొందుతోంది. ఇందులో గోపీచంద్ పక్కా కమర్షియల్ లాయర్ గా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఎర్లియర్ గా ‘ప్రతి రోజూ పండగే’ మూవీతో సాలిడ్ హిట్ కొట్టిన మారుతి.. ఈ సినిమాను మరింత వినోదాత్మకంగా మలిచే ప్రయత్నంలో ఉన్నాడు. మొన్నామధ్య ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ కు కరోనా సెకండ్ వేవ్ బ్రేక్స్ వేసినట్టు సమాచారం.
ఇప్పటి వరకూ పక్కా కమర్షియల్ సినిమాను శరవేగంగా చిత్రీకరించిన దర్శకుడు మారుతి.. ప్రస్తుతం చిత్రీకరణను హోల్డ్ చేసి… కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిన తర్వాత మొదలు పెట్టాలని నిర్ణయించారట. ఒక వేళ షూటింగ్ మొదలైనా కూడా.. థియేటర్స్ మూసివేత, టిక్కెట్ల రేటు తగ్గింపు లాంటి సమస్యల వల్ల .. అనుకున్న టైమ్ కి ‘పక్కా కమర్షియల్’ సినిమా విడుదల అయ్యే అవకాశాల్లేవు.
ఇక గోపీచంద్ మరో సినిమా ‘సీటీమార్’ విడుదలకి కూడా కరోనా కారణంగా అంతరాయం ఏర్పడే అవకాశముంది. సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ స్పోర్ట్ యాక్షన్ డ్రామా .. విడుదలకు ముందే అంచనాల్ని పెంచేసింది. అలాగే.. హీరోయిన్ గా నటిస్తున్న తమన్నా కూడా ఓ కీలక పాత్ర పోషిస్తూండడం ఈ సినిమాకి హైలైట్ కాబోతోంది. మొత్తానికి గోపీచంద్ రెండు సినిమాలూ కరోనా కబంధ హస్తాల్లో చిక్కుకోవడం గమనార్హం. మరి వీటికి ఎప్పుడు విముక్తి కలుగుతుందో చూడాలి.
Must Read ;- సినిమా గుండెల్లో కరోనా గుబులు.. విడుదల వాయిదా











