హీరో గోపీ చంద్, దర్శకుడు మారుతి కాంబినేషన్ లో రూపొందే ‘పక్కా కమర్షియల్’ సెట్స్ పైకి వెళ్లింది. ఇందులో ఓ కీలక పాత్రను సత్యరాజ్ పోషిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం గోపీచంద్ నటించిన ‘సీటీమార్’విడుదలకు సిద్ధమైంది. పక్క కమర్షియల్ కు అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరించనున్నారు. బన్నీ వాసు నిర్మాత. ఇవే బ్యానర్స్ లో ఇంతకుముందు భలేభలే మగాడివోయ్, ప్రతిరోజూ పండగే చిత్రాలు రూపొందాయి.
నటుడు సత్యరాజ్ కూడా ప్రతిరోజూ పండగ నుంచి మారుతితో బాగానే ట్యూన్ అయినట్టుంది. మరోసారి ఇందులో అవకాశం వచ్చింది. నిన్నటి నుంచి ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అల్లు అరవింద్ కూడా సెట్స్ లో ఉన్నారు. గోపీచంద్ కు ఇది 29 వ మూవీ. అక్టోబరు 1న ఈ సినిమా విడుదలయ్యేలా ప్లాన్ చేసుకున్నారు. జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. హీరోయిన్ ఎవరన్నది తేలాల్సి ఉంది. హిందీ సినిమా ‘జాలీ ఎల్ఎల్బీ 2’కు రీమేక్ గా ఈ సినిమా రూపొందుతోందని సమాచారం.
Must Read ;- అనసూయ వేశ్య పాత్ర పై క్లారిటీ ఇచ్చిన మారుతి











