సీనియర్ రాజకీయ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చెందిన 4 ఎకరాల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సింహాచలం భైరవవాక సమీపంలోని విజయరాంపురం అగ్రహారంలో 1997లో ప్రత్యూష అసోషియేట్స్ మేనేజింగ్ పార్టనర్‌గా గంటా శ్రీనివాసరావు నాలుగు ఎకరాల భూమి కొనుగోలు చేశారు. అప్పటికి గంటా రాజకీయ ప్రవేశం కూడా చేయలేదు. అయినా గంటా రాజకీయాల్లో వచ్చి భూములు కాజేశారంటూ ప్రచారం చేయడం ఇప్పుడు తాజాగా జరుగుతోంది. ఇదంతా కుట్ర పూరితంగా జరుగుతున్న దుష్ప్రచారం అనే అభిప్రాయం కూడా పలువురిలో ఉంది.
అసలేం జరిగింది
విశాఖ సమీపంలోని సింహాచలం వద్ద 124 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అందులో 60 ఎకరాలపై కోర్టులో వివాదం నడుస్తోంది. మిగిలిన 64 ఎకరాలను తాజాగా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇందులో గంటా శ్రీనివాసరావుకు చెందిన 4 ఎకరాల భూమి కూడా ఉంది. ఇటీవలే ఈ భూమిని ఇండియన్ బ్యాంక్ వేలం వేయనున్నట్టు ప్రకటించింది. 13 స్థిరాస్తులు తనఖా పెట్టి రూ.248 కోట్ల రుణాలు ఎగవేసిన కేసులో ఈ భూమిని వేలం వేయాలని ఇండియన్ బ్యాంక్ నిర్ణయించింది. ఇంతలోగా ఈ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కొసమెరుపు.
రాజకీయాల్లోకి రాక ముందే కొన్నాం…
గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి 1999 సంవత్సరంలో పోటీ చేశారు. సింహాచలం వద్ద గంటాకు చెందిన వ్యాపార సంస్థ ప్రత్యూష అసోషియేట్స్ కంపెనీ పేరుతో 1997లోనే భూమి కొనుగోలు చేశారు. అయితే రాజకీయాల్లోకి వచ్చాక గంటా భూములు ఆక్రమించారంటూ ఒక ప్రచారం జరుగుతోంది. కావాలనే గంటాపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని గంటా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టపరంగా కొన్న భూములను కూడా ఉద్దేశపూర్వకంగా వివాదాల్లోకి లాగుతున్నారని అంటున్నారు.
Also Read ;- గంటాకు కలిసిరాని కాలం
1997 లో భూమి కొనుగోలు చేసినట్లుగా స్పష్టంగా తెలియజేస్తున్న రిజిస్ట్రేషన్ పత్రాలు :












